
పెచ్చులూడిపోయిన రోడ్డు పక్కన నిర్మాణం
హోసూరు వార్తలు..
క్రిష్ణగిరి: సూళగిరి యూనియన్‌లో నాసిరకంగా, నత్తనడకన సాగిస్తున్న తారురోడ్డు పనులను త్వరగా ముగించి ప్రజల వినియోగానికి తీసుకురావాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సూళగిరి తాలూకాని అత్తిముగం నుంచి సంతార్‌శెట్టిపల్లి వరకు గత 11 నెలల క్రితం రూ. 4.71 కోట్ల నిధులతో తారురోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. నెలలు గడిచినా తారురోడ్డు నిర్మాణం పూర్తికాలేదని, నిర్మాణ పనులను నాసిరకంగా చేయడంతో రోడ్డుపక్కన ప్రహరీలు పెచ్చులూడిపోతున్నాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు. దీనివల్ల సందార్‌శెట్టిపల్లి, నరసాపురం, పలవనపల్లి, ఆలుసాధనపల్లి, ఎట్టిపల్లిగుట్ట తదితర చుట్టుపక్కల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని తెలిపారు. త్వరగా తారురోడ్డు పనులను పూర్తిచేయాలని కోరారు.