
తుమకూరు: గ్రామ పంచాయతీలలో ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. గురువారం తుమకూరు నగర సమీపంలోని విద్యాభీష్మ హెచ్.ఎం. గంగాధరయ్య మోమోరియల్ సమావేశం హాల్లో గ్రామ పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, పంచాయతీ అభివృద్ధి అధికారులతో ఏర్పాటు చేసిన ఒక రోజు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులు, పీడీఓలు నిజాయితీతో విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో 330 గ్రామ పంచాయతీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పీడీఓలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధ్దికి కృషి చేయాలన్నారు.
క్రీడల్లో పాల్గొనడం ముఖ్యం
గౌరిబిదనూరు: గెలుపు ఓటముల కన్నా క్రీడల్లో పాల్గొనడం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే పుట్టస్వామి గౌడ అన్నారు. గురువారం ఉదయం నగరంలోని నేతాజీ క్రీడా మైదానంలో దైహిక ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఇదే మైదానంలో పౌర కార్మికులకు జరిగిన క్రీడలను సైతం ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దారు మహేశ్ పత్రి, కమిషనర్ గీత, నగరసభ సభ్యులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
గౌరిబిదనూరు: మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే దేశం అభివృద్ధి దిశలో సాగుతుందని ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ అన్నారు. గురువారం ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ కళాశాలలో ఆంతరికమైన నాణ్యతా భరోసా సెల్ (కోశం) వారిచే లింగ సంవేదనా, మహిళా సబలీకరణ అంశంపై జరిగిన ఒకరోజు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేడు రాజకీయాల్లో సైతం మహిళలకు రిజర్వేషన్ల సదుపాయం ఉందని, వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతిరెడ్డి, పరశురామరెడ్డి, డా సబితాబెన్నడి, డా.ఎవి రమణ, మధుసూదనరెడ్డి, ప్రిన్సిపాల్ శివణ్ణ తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ హాత్‌లో వస్త్ర మేళా
మైసూరు: మైసూరు నగరంలోని హెబ్బాలలోని జేఎస్‌ఎస్ అర్బన్ హాత్‌లో ఈనెల 22 నుంచి అక్టోబర్ 6 వరకు సంస్కృతి, హాత్ కర్గ్ –2023 చేతి మగ్గాల మేళాను నిర్వహిస్తున్నట్లు జేఎస్‌ఎస్ మహాపీఠం విభాగం డైరెక్టర్ మొరబద మల్లికార్జున తెలిపారు. గురువారం నగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నేత కార్మికులు స్వయంగా చేతి మగ్గాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తారన్నారు.
మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులు ●
● మాజీ రౌడీషీటర్ అరెస్ట్
శివాజీనగర: నిర్మాణ దశలో ఉన్న భవన యజమానిని రూ.15 లక్షలు ఇవ్వాలని బెదిరించిన ఆరోపణపై మాజీ రౌడీషీటర్, బీజేపీ నాయకుడు సంపంగిరామనగర పోలీసులు అరెస్ట్ చేశారు. సంపంగిరామనగర వ్యాప్తిలో మాజీ రౌడీషీటర్ ఆనంద్‌ను అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన చౌధరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్‌తో పాటుగా పలు లావాదేవీల్లో నిమగ్నమైన ఆనంద్, బీజేపీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. గత బీబీఎంపీ ఎన్నికల్లో సంపంగిరామనగర వార్డు నుండి పోటీచే సి ఓటమిపాలయ్యాడు. పోలీస్ కమిషనర్ సూచన మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.
మండ్యలో
దసరా క్రీడా పోటీలు
మండ్య: మండ్య నగరంలోని సర్ ఎం.వి. క్రీడా మైదానంలో జిల్లా స్థాయి దసరా క్రీడా పోటీలను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ యతీశ్ క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం వివిధ క్రీడలు నిర్వహించారు.


ఓ స్టాల్‌లో చీరను పరిశీలిస్తున్న మహిళలు
