హోసూరు: మిత్రుని హత్య కేసులో ఇద్దరికి పదేళ్లు జైలు శిక్ష పడింది. వివరాలు.. సూళగిరి సమీపంలోని కోటంగిరి ప్రాంతానికి చెందిన చెన్నరాజప్ప (42), భార్య చిన్నమ్మ (35). వీరికి మహేష్ (14) బాలుడున్నాడు. కొన్నేళ్ల కిందట దంపతులు గొడవలు పడి విడిపోయారు. చెన్నరాజప్ప బెంగళూరులో నివాసముంటూ పండ్ల వ్యాపారం చేసేవాడు. 2018 డిసెంబరు 27న స్వగ్రామానికెళ్లిన చెన్నరాజప్ప మిత్రులు రాజప్ప, శీనప్పలతో కలిసి మద్యం సేవిస్తుండగా గొడవ జరిగి చన్నరాజప్పను హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు హోసూరు కోర్టులో జరుగుతూ వచ్చింది. బుధవారం సాయంత్రం కేసును విచారణ జరిపిన న్యాయమూర్తి రోస్లిన్ దురై.. దోషులకు పదేళ్ల జైలు శిక్షతో పాటు తలా రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.