బనశంకరి: పోలీసులు వేధిస్తున్నారని ఓ వ్యక్తి డెత్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తలఘట్టపుర నాగరాజ్ (47). వివరాలు... సనావుల్లా అనే వ్యక్తి ఆధీనంలో ఉన్న కంపెనీలో నాగరాజ్ పనిచేస్తున్నారు. ఈ కంపెనీ పేరుతో నగదు తీసుకుని వంచనకు పాల్పడ్డారని నటరాజ్ అనే వ్యక్తి వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించి కంపెనీ యజమాని సనావుల్లాకు బదులుగా నాగరాజ్‌ను పోలీసులు తీసుకెళ్లి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ. దీంతో మనస్తాపం చెందిన నాగరాజ్ డెత్‌నోట్‌రాసి బుధవారం తలఘట్టపుర నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డెత్‌నోట్‌లో పోలీసుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.