శివాజీనగర: కావేరి నీరు నిర్వహణ మండలి, కావేరి ప్రాధికారలను రద్దు చేసి ఎన్నికల కమిషన్ తరహాలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని రైతు నాయకుడు కురుబురు శాంతకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే తమిళనాడుకు నీరు వదలటాన్ని నిలుపుదలకు సుప్రీంకోర్టు ముందు పునర్ పరిశీలన పిటిషన్ వేయాలి. కావేరి నిర్వహణ మండలి, ప్రాధికార, ప్రభుత్వాల నుంచి వాస్తవాలు చేరటం లేదన్నారు. దీంతో మండలి, ప్రాధికార రద్దు చేసి నాలుగు రాష్ట్రాల నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఇక రాష్ట్రం నుంచి రాజ్యసభకు కర్ణాటక వారే ఎంపిక కావాలి. రాష్ట్రం తరపున గళం విప్పేవారు కావాలి. నిర్మలా సీతారామన్ వైఖరి రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు. కావేరి బంద్‌కు పిలుపునివ్వాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.