మైసూరు: పాల ట్యాంకర్ ఢీకొనడంతో వైద్య విద్యార్థి మృతి చెందిన ఘటన మడికేరిలో చోటు చేసుకుంది. మృతుడిని ఉడుపికి చెందిన విజేశ్ (24)గా గుర్తించారు. ఉడుపి నుంచి విజేశ్ బైక్‌లో మడికేరికి వెళ్తుండగా కాటెకేరి వద్ద మడికేరి నుంచి సూళ్య వైపు వెళ్తుండగా పాల ట్యాంకర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వేశ్యా వాటికపై పోలీసుల దాడి
బాగేపల్లి: వేశ్యా వాటికపై పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి ఒక మహిళను రక్షించిన ఘటన బాగేపల్లి తాలుకాలో చోటు చేసుకుంది. బాగేపల్లి పట్టణం టీబీ క్రాస్ వద్ద ఉన్న ఓ లాడ్జిలో వేశ్యా వాటిక నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
బైకిస్టు దుర్మరణం
బాగేపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని బైకిస్టు మృతి చెందిన ఘటన బాగేపల్లి పట్టణ సమీపంలోని జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. బాగేపల్లి జాతీయ రహదారిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి (25)ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు.
నీటి నిలిపివేతకు
ఆర్డినెన్స్ తేవాలి
శివాజీనగర: కావేరి జలాలను తమిళనాడుకు వదలడం సాధ్యపడదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలను జరిపి ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు డిమాండ్ చేశారు. గురువారం కర్ణాటక జల సంరక్షణా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న భారతీయ విద్యాభవన్‌లో ‘నమ్మ నీరు నమ్మ హక్కు’ పేరుతో సదస్సు నిర్వహించారు. చంద్రు మాట్లాడుతూ సుప్రీం కోర్టు కూడా నీరు నిర్వహణా ప్రాధికారకు అనుకూలమైన తీర్పు నిచ్చింది, ఇందులో మన న్యాయవాదుల వైఫల్యం ఉందన్నారు. అందుకే అసెంబ్లీలోనే ఆర్డినెన్స్‌ను తేవాలని తెలిపారు.
అక్టోబరు 16 నుంచి చిత్రోత్సవం
మైసూరు: నాడ హబ్బ మైసూరు దసరా ఉత్సవాల్లో చలనచిత్రోత్సవం అక్టోబరు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మాల్ ఆఫ్ మైసూరులో ఉన్న ఐనాక్స్‌లో జరుగుతుందని ఉప సమితి సభ్యులు తెలిపారు. గురువారం సభ్యులు ఐనాక్స్ థియేటర్‌ను పరిశీలించి ఏర్పాట్ల గురించి చర్చించారు. సీట్లు, టికెట్ ధరలు, ఆధునిక సాంకేతికత సక్రమంగా ఉండాలని సూచించారు. టికెట్లు మొత్తం ఆన్‌లైన్‌లో విక్రయిస్తారని తెలిపారు.