
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం
కోలారు: తాలూకాలోని పీఎల్‌డీ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల నికర లాభం గడించినట్లు బ్యాంకు అధ్యక్షుడు కృష్ణేగౌడ తెలిపారు. గురువారం నగరంలోని టి.చెన్నయ్య రంగమందిరంలో బ్యాంకు సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సంవత్సరం బ్యాంకు మొత్తం రూ.51.11 లక్షల డిపాజిట్ల నుంచి రైతులకు రూ.3.41 కోట్ల రుణాలు అందించిందన్నారు. రుణాల వసూళ్లలో బ్యాంకు ఉభయ జిల్లాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. బ్యాంకు మాజీ అధ్యక్షుడు విట్టప్పనహళ్లి వెంకటేష్ మాట్లాడుతూ 88 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్యాంకు రైతులకు ఉత్తమ సేవలు అందించిందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు ఎం గోవిందప్ప, డైరెక్టర్ శశిధర్, శివకుమార్, కేసీ మంజునాథ్, జి.అమరేష్ తదితరులు పాల్గొన్నారు.