
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఉపాధ్యాయులు
గంగావతి: నగరంలోని వినాయక ఎయిడెడ్ కన్నడ ప్రాథమికోన్నత పాఠశాలలో 15 ఏళ్ల క్రితం చదువుకున్న పాత విద్యార్థుల కలయిక అపూర్వ సమ్మేళనాన్ని గురువారం ఘనంగా జరిపారు. ఆ బ్యాచ్ విద్యార్థులందరూ పాఠశాలకు చేరుకొని పాత మిత్రులను చాలా ఏళ్ల తర్వాత కలవడంతో పరస్పరం ఆలింగనం చేసుకుని క్షేమసమాచారాలను తెలుసుకుని ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చిన్ననాటి చదువులు, ఉపాధ్యాయుల విద్యాబోధన విధానాలు, వారు ఆడుకున్న ఆటపాటలు, ఇతర జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనాటి చదువులే గొప్ప, వాటిని ఎన్నటికీ మరవలేమన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు షడక్షరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ నాయుడు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఉజ్జినగౌడ, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం విందు భోజనాన్ని ఆరగించి వీడ్కోలు పలికారు.