
ఘటనాస్థలంలో ప్రమాద దృశ్యం
కోలారు: అతి వేగంగా వచ్చిన ట్యాంకర్ వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ దుర్మరణం పాలైన ఘటన తాలూకాలోని మడేరహళ్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సూలూరు గ్రామానికి చెందిన ధనుష్(29) అనే ఆటో డ్రైవర్ తాలూకాలోని మడేరహళ్లి వద్ద నుంచి కోలారు వైపునకు వస్తుండగా ఆటోను వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్ ఢీకొనడంతో ఆటో నుంచి కిందపడిన ధనుష్ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ ట్యాంకర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే కోలారు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.