
శ్రీనివాస్(ఫైల్)
మాలూరు: చిన్న కారణానికి తనపై దాడి చేసి కొట్టినందుకు ఆవేదన చెందిన ఓ దళిత యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని హురుళుగెరెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్(30) అనే యువకుడిపై అశోక్, రమేష్, ధర్మేంద్ర, మంజు అనే నలుగురు చీపుర్లతో దాడి చేసి కొట్టారు. నిన్న రాత్రి వీరు నలుగురు మందు పార్టీ చేసుకుంటున్న సమయంలో స్నేహితుల మధ్య చిన్న విషయానికి గొడవ జరిగింది. ఘటన అనంతరం అవమానం భరించలేక శ్రీనివాస్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై మాలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.