
మహబూబ్(ఫైల్), రోదిస్తున్న కుటుంబ సభ్యులు
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకాలో చీకలపర్వి రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బాబూరావు డాంబర్ ప్లాంట్ వద్ద ఇసుక ట్రాక్టర్, టాటా ఏస్‌లు ఢీకొన్న ప్రమాదంలో బురాంపుర నివాసి మహబూబ్(23) మరణించాడు. మాన్వి నుంచి మహబూబ్ టాటా ఏస్‌ను నడుపుకుంటూ బురాంపురకు వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ తాగిన మైకంలో వేగంగా వచ్చి అదుపు తప్పి ఢీకొనడంతో మహబూబ్ మరణించాడని మాన్వి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హిరేమట్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.