
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకొన్న దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఆవేదన చెందిన భార్య ఆత్మహత్య చేసుకొన్న ఘటన హడ్కో వద్ద జరిగింది. వివరాల మేరకు హోసూరు సమీపంలోని బత్తలపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్, కవిత (23) ప్రేమించుకుని గతేడాది అక్టోబరు 10న పెళ్లి చేసుకున్నారు.
అయితే భార్యాభర్తల మధ్య తరచూ పోట్లాటలు జరిగేవి. రెండు రోజుల క్రితం గొడవ పడడంతో మహమ్మద్ భార్యను తీసుకెళ్లి ఆమె తాత ఇంట్లో వదలిపెట్టి వచ్చాడు. విరక్తి చెందిన కవిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. హడ్కో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు.