
పట్టుబడిన మహమ్మద్ జుబేర్, స్వాధీనం చేసుకున్న పిస్తోల్
స్నేహితుడి హత్యకు కుట్ర పన్నిన మహమ్మద్ జుబేర్, పుక్రాన్ అలిఖాన్ అనే నిందితులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బనశంకరి: స్నేహితుడి హత్యకు కుట్ర పన్నిన మహమ్మద్ జుబేర్, పుక్రాన్ అలిఖాన్ అనే నిందితులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన రౌడీషీటర్ అనీశ్, మహమ్మద్‌జుబేర్, పుక్రాన్‌అలిఖాన్ స్నేహితులు. ఈ ముగ్గురూ వివిధ నేరాల్లో భాగస్వాములు. వీరి మధ్య ఆర్థిక విషయాలపై విభేదాలు ఏర్పడ్డాయి.
2021లో ఓకేసులో అనీశ్ జైలుకెళ్లగా అనుచరుడు అలీ హత్యకు గురయ్యాడు. ప్రతీకారం తీర్చుకోవాలని అనీశ్ భావిస్తున్నట్లు తెలుసుకున్న మిగతా ఇద్దరు స్నేహితులు అతన్ని హత్య చేయాలని పథకం రచించారు. మహారాష్ట్ర నుంచి పిస్తోల్ తెప్పించారు. బాణసవాడి పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం దాడి చేసి మహ్మద్‌జుబేర్, పుక్రాన్‌అలిఖాన్‌ను అరెస్ట్‌చేశారు.