
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే వై. ప్రకాష్
● ఐదుమందికి గాయాలు
క్రిష్ణగిరి: రోడ్డు పక్కన నిలిపిన లారీని బస్సు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఐదు మందికి తీవ్ర గాయాలేర్పడిన ఘటన సూళగిరి వద్ద జరిగింది. వివరాల మేరకు హోసూరు నుంచి క్రిష్ణగిరి వైపు శనివారం సాయంత్రం ప్రయాణికులను తీసుకొని ఓ ప్రైవేట్ బస్సు బయల్దేరింది. హోసూరు– క్రిష్ణగిరి హైవేపై సూళగిరి సమీపంలోని సుండగిరి వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఈ బస్సు ఢీకొనింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్‌తో, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు తగిలాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
భూమిపూజ
హోసూరు: హోసూరు కార్పొరేషన్ పరిధిలోని 15వ వార్డులో రూ. 8 లక్షలతో చేపట్టిన సముదాయ భవన నిర్మాణ పనులకు హోసూరు ఎమ్మెల్యే వై. ప్రకాష్, మేయర్ ఎస్.ఏ. సత్య ఆదివారం భూమిపూజ చేశారు. డిప్యూటీ మేయర్ ఆనందయ్య, రవి, నాగరాజ్, కణ్ణన్, నవీణ్‌కుమార్, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.