
అధికారికి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
కెలమంగలం: తమిళనాడు రాష్ట్రంలో ఆవిన్ పాల ఉత్పత్తి ధరలను ప్రభుతం పెంచడం హర్షదాయకంగానే ఉందని, పాల ఉత్పత్తిని చేసే రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్ చేస్తూ పాల ఉత్పత్తి సహకార సంఘం అధికారికి రైతు సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, నెయ్యి, పాల పౌడర్ తదితర ఉత్పత్తుల ధరను ప్రభుత్వం పెంచిందని, పాల ఉత్పత్తి చేసే రైతులకు పాల ధరలు పెంచి పశువులకు రాయితీ ధరలతో గడ్డిని సరఫరా చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసే కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు.