
చదువులు చదివినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతో యువతి
కర్ణాటక: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉడుపి జిల్లా బైందూరు తాలూకా కాల్నొడు గ్రామానికి చెందిన గౌతమి(22) ఎంకాం పూర్తి చేసింది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకున్నారు.
అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో మనోవేదనకు గురై తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బైందూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.