శివాజీనగర: నూతన మంత్రివర్గం కొలువుతీరడం పూర్తి కాగా, మంత్రులు కావడం 8 మంది మంత్రి కావడం ఇదే తొలిసారి. మిగతావారు రెండు మూడుసార్లు ఆ పదవిని అలంకరించినవారే.
● లక్ష్మీ హెబ్బాళ్కర్, భైరతి సురేశ్, మధు బంగారప్ప, కే.ఎన్.రాజణ్ణ, బీ.నాగేంద్ర, మాంకాళ్ సుబ్బు వైద్య, ఎన్.ఎస్.బోసురాజు, డాక్టర్ ఎం.సీ.సుధాకర్ తొలిసారిగా మంత్రులయ్యారు.
●హెచ్.సీ.మహాదేవప్ప 4వ సారిగా, కృష్ణభైరేగౌడ 3వ సారిగా, హెచ్.కే.పాటిల్ 4వ సారిగా ఎన్.చెలువరాయస్వామి, ఆర్.బీ.తిమ్మాపురలు 3వ సారి మంత్రులయ్యారు.
● పిరియాపట్టణ వెంకటేశ్, రహీంఖాన్, ఈశ్వర ఖండ్రె, దినేశ్ గుండురావు, శివానంద పాటిల్, డీ.సుధాకర్, సంతోష్ లాడ్, శివరాజ్ తంగడగిలు 2వ సారిగా మంత్రులయ్యారు.
లింగాయత్‌లకు ఎక్కువ పదవులు
● కులపరంగా చూస్తే అత్యధికంగా లింగాయత్ వర్గం నుంచి 7 మంది మంత్రులుగా, ఒక్కలిగ సముదాయంలో ఐదు మంది మంత్రులయ్యారు.
● ఎస్సీ వర్గాలో 6 మందికి మంత్రి స్థానాలు లభించగా, ఎస్టీలకు ముగ్గురికి పదవి దక్కింది.
● కురుబ సముదాయం నుండి ఇద్దరు, రెడ్డి సామాజిక వర్గం నుండి ఇద్దరికి, ముస్లిం సముదాయం నుండి ఇద్దరు, ఈడిగ, క్రైస్తవ, బ్రాహ్మణ, జైన్, బెస్త, రాజు క్షత్రియ వర్గాల్లో ఒక్కొక్కరికి బెర్తు లభించింది.


