
ఆధారాలతో బీజేపీ నేత రమేశ్
బనశంకరి: ఎత్తినహొళె పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మంగళవారం బెంగళూరు దక్షిణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎన్‌ఆర్.రమేశ్, అరసికెరె ఎమ్మెల్యే శివలింగేగౌడపై లోకాయుక్తలో రెండు ఫిర్యాదులు చేశారు. లోకాయుక్త కార్యాలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
అరసికెరె ఎమ్మెల్యే శివలింగేగౌడ, విశ్వేశ్వరయ్య జలమండలి తుమకూరు విభాగ చీఫ్ ఇంజనీర్ మాదర్, అసిస్టెంట్ ఇంజనీర్ అనంద్‌కుమార్, హాసన్ విభాగ ఇంజనీర్ రఘునాథ్, అరసికెరె ఉపవిభాగ ఇంజనీర్ రఘు, కేఆర్‌ఐడీఎల్ సంస్థ హాసన విభాగ ఇంజనీర్ సిద్దప్ప, అరసికెరె ఉపవిభాగ అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్, అసిస్టెంట్ ఇంజనీర్ దీక్షత్, పంచాయతీరాజ్‌శాఖ అరసికెరె విభాగ ఇంజనీర్ బాలకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ బసవరాజు, జూనియర్ ఇంజనీర్ ఉమేశ్ ఇతర అవినీతి అధికారులపై ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్యే శివలింగేగౌడ అధికారులతో కుమ్మకై ్క రూ.150 కోట్లకు పైగా దుర్వినియోగానికి పాల్పడారని ఎన్‌ఆర్.రమేశ్ ఆరోపించారు.
ఎమ్మెల్యే శివలింగేగౌడపై
లోకాయుక్తలో ఫిర్యాదు