శివాజీనగర: రానున్న విధానసభ ఎన్నికలకు బీఎస్పీ 53 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ... విధానసభ ఎన్నికల్లో బీఎస్పీ ప్రముఖ పాత్ర పోషించనుందని, పలు నియోజకవర్గాల్లో తాము గెలుపు సాధిస్తామన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అధ్యక్షతన రాష్ట్ర ఇన్‌చార్జి మాజీ ఎంపీ డాక్టర్ అశోక్ సిద్ధార్థ, రాష్ట్ర కన్వీనర్లు మారసంద్ర మునియప్ప, నితిన్ సింగ్, దినేశ్ గౌతమ్, ఎం.గోపినాథ్, తాను ఢిల్లీలో జరిగిన సభలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. మళవళ్లి నుంచి తాను పోటీ చేస్తానని వెల్లడించిన ఆయన, మిగతా గురుమిట్కల్ నుంచి కే.బీ.వాసు, మధుగిరి నుంచి ఎన్.మధు, తిపటూరు నుంచి అశ్వత్థ నారాయణ, చామరాజనగర నుంచి హ.రా.మహేశ్, బేలూరు నుంచి గంగాధర్ బహుజన్, ఆనేకల్ నుంచి చిన్నప్ప చిక్కహెగడె, యలహంక నుంచి సందీప్ మారసంద్ర మునియప్ప పోటీ చేస్తారన్నారు.