
పాల్గొన్న ఎమ్మెల్యే బసవరాజ్, గ్రామ ప్రముఖులు
యశవంతపుర: బీజేపీ ఎమ్మెల్యేలకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఫోన్ చేసి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు సీఎం బసవరాజ బొమ్మై ఆరోపించారు. ఆయన మంగళవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో టికెట్ ఇస్తాం రమ్మని అనేక మందికి డీకేశి ఫోన్ చేస్తున్నారని అన్నారు.
సీసీ రోడ్ల పనులకు భూమిపూజ
గంగావతి: కనకగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బసవరాజ్ భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కెసరట్టి హంచనాళ, బట్ర హంచనాళ క్యాంప్, మరకుంబి తదితర పలు గ్రామాల్లో సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల ప్రముఖులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆప్ జాగృతి అభియాన్
కంప్లి: రాష్ట్రంలో అవినీతిని తరిమికొట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)దే అంతిమ విజయమని క్షేత్ర ఆప్ కార్యదర్శి హెచ్.ప్రహ్లాద్‌నాయక్ తెలిపారు. మంగళవారం ఉద్భవ గణపతి ఆలయం నుంచి ప్రారంభించిన పార్టీ జాగృతి అభియాన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఓటర్లు అవినీతిపరుల బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. అన్ని పార్టీలకు అధికారం ఇచ్చిన ఓటర్లు రాష్ట్రంలో ఒకసారి ఆప్‌కు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం ఆప్ జిల్లా సంపర్క అధికారి మహ్మద్ రషీబ్ మాట్లాడుతూ త్వరలో కంప్లి క్షేత్ర అభ్యర్థి పేరును ప్రకటిస్తారన్నారు. ఆప్ అధికారంలోకి వస్త్ నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉచిత విద్యుత్, తాగునీరుతో పాటు అనేక మౌలిక సౌకర్యాలు అందించి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తగ్గిస్తామన్నారు. అభియాన్ ప్రధాన వీధుల గుండా సాగగా, డాక్టర్ పునీత్‌రాజకుమార్ సర్కిల్‌లో సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఆప్ ప్రముఖులు మోదుపల్లి రామమూర్తి, కార్యకర్తలు ప్రవీణ్, కే.గురురాజ్, పరశురాం, వీరేష్, ఉమాదేవి, లక్ష్మీదేవి, కవిత, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక మండలికి డిమాండ్
బళ్లారిఅర్బన్: వెనుకబడిన ఉప్పార సమాజాభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని కర్ణాటక భగీరథ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు యూ.ఉరుకుందప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల జనాభా కలిగిన, ఆర్థికంగా వెనుకబడిన తమ సమాజానికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ స్థానం కూడా కట్టబెట్టాలన్నారు. ఉప్పార సమాజాన్ని అన్ని వర్గాలతో సమానంగా ఆదరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సమాజం వారికి రాజకీయ పరంగా అవకాశం కల్పించాలన్నారు. సమాజ ప్రముఖులు ఉప్పార మల్లప్ప, సన్నభీమన్న, రిటైర్డ్ ఉపన్యాసకులు నరసన్న, కాళింగరాజు పాల్గొన్నారు.

నిర్వహిస్తున్న ఆప్ నాయకులు, కార్యకర్తలు