
కేఆర్‌పీపీకి ఇచ్చే డోలును కొడుతున్న అభిమాని యమనూరప్ప పుండేగౌడ
బళ్లారిఅర్బన్: వచ్చే ఎన్నికల్లో కేఆర్‌పీపీ విజయం సాధించాలని 101 డోళ్లను అందజేస్తానని గంగావతి కురుబ సమాజానికి చెందిన యమనూరప్ప పుండేగౌడ తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా భవనంలో విలేకరులతో మాట్లాడారు. కేఆర్‌పీపీ సంస్థాపకుడు గాలి జనార్దన్‌రెడ్డికి ఇటీవల 101 గొర్రెను ఇచ్చానన్నారు. వాటిని గొర్రెల శాలలో పెంచుతున్నారన్నారు. బళ్లారి నగర కేఆర్‌పీపీ అభ్యర్థి గాలి లక్ష్మీఅరుణ గెలుపు కోసం మొదట ఒక డోలు అందించి నామినేషన్ వేసేలోపు మిగిలిన 100 డోళ్లను జనార్దన్‌రెడ్డికి అప్పగిస్తానన్నారు. బీరలింగేశ్వర స్వామి వారికి ఆశీర్వాద పూజలు నిర్వహించి ఈ బీరప్ప డోలును అందిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పార్టీ అభిమానులు విరుపాక్షి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.