
గరుడ వాహనంలో ఊరేగుతున్న స్వామి వారు
మాలూరు : ప్రసిద్ధ యాత్రా స్థలం చిక్కతిరుపతి ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయంలో స్వామి వారికి ఉగాది సందర్భంగా గరుడ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు రవి, గోపాలకృష్ణ భరద్వాజ్, ఎన్ శ్రీధర్ నేతృత్వంలో నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తిని పల్లకీలో ప్రతిష్టించి ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు గరుడ వాహనోత్సవంలో పాల్గొన్నారు.
పాత్రికేయ సంఘానికి విరాళం
కోలారు : నగరంలోని పాత్రికేయుల క్షేమాభివృద్ధి సంఘానికి ఇండియన్ మూవ్‌మెంట్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు అబ్దుల్ సుభాన్ రూ.లక్ష విరాళం అందించారు. మూలతః జిల్లాకు చెందిన సుభాన్ మూడేళ్ల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ఇండియన్ మూవ్‌మెంట్ పార్టీని స్థాపించారు. జిల్లా పాత్రికేయుల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలను మెచ్చి పాత్రికేయుల క్షేమాభివృద్ధి నిధికి తన వంతు విరాళం ఇచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గోపినాథ్, సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గణేష్, చంద్రశేఖర్, ఆసిఫ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
గంజాయి విక్రేతల పట్టివేత
కేజీఎఫ్ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాబర్ట్‌సన్‌పేట సీఐ టీఆర్ కుమారస్వామి నేతృత్వంలో ఎస్‌ఐ భారతి, సిబ్బంది అరెస్టు చేశారు. అండర్‌సన్‌పేట హరిశ్చంద్ర వీధికి చెందిన అస్లాం, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వీరనమల్ల రామకుప్పం మండలం పోర్టుకొల్లి గ్రామానికి చెందిన నాగరాజ్ అనే నిందితులను పట్టుకున్న పోలీసులు వీరి నుంచి 2.45 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


అస్లాం నాగరాజ్