బడిబాట సమర్థవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బడిబాట సమర్థవంతంగా నిర్వహించాలి

May 30 2026 2:56 AM | Updated on May 30 2026 2:56 AM

ఘనంగా ‘సంథల్‌ షరీఫ్‌’

కరీంనగర్‌ టౌన్‌: బడిబాట కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లను పెంచాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విభాగాల ఉన్నతాధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 20 వరకు జిల్లావ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించి, అడ్మిషన్లు పెంచాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరేలా చూడాలన్నారు. వర్షాకాలా న్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల భవనాలకు అవసరమైన మరమ్మతు చేయించాలన్నారు. ఎక్కువ మంది విద్యార్థులుండే పాఠశాలలు, హాస్టళ్లలో సిబ్బంది, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలన్నారు. కామన్‌ డైట్‌ మెనూకు అవసరమైన సరుకుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల ని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాం, పుస్తకాలు సకాలంలో అందించా లన్నారు. ఎస్సీ సంక్షేమశాఖ డీడీ తిరుపతి రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్‌ ప్రకా శ్‌, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌, ఆర్‌సీవో అంజలి, విద్యాశాఖ ఏడీ మాధవి, కోఆర్డి నేటర్లు అశోక్‌ రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌తో అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) విషయంలో అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పీసీసీ సమన్వయకర్త కూన శ్రీశైలం గౌడ్‌ అన్నారు. సంఘటనా సృజన్‌ అభియాన్‌లో భాగంగా శుక్రవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్‌, చొప్పదండి ని యోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ విషయంలో ప్రతి బూత్‌ నుంచి కనీసం ఐదుగురు పార్టీ సభ్యులు బాధ్య త తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను కాపాడుకునే విధంగా ఓటర్‌ మ్యాపింగ్‌ గురించి అవగాహన కల్పించాలన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ బీఎల్‌ఏలు ఎస్‌ఐఆర్‌ను పరిశీలించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కాంగ్రెస్‌పై విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలే స్టార్‌ క్యాంపెనియర్లుగా పనిచేస్తూ వాస్తవాలు తెలియచేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ తక్కువైందని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొంటున్నారన్నారు. చిన్న చిన్న బేధాలు ఉంటే సరిదిద్దుకోవాలని, బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై యుద్ధం చేయాలన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికే కార్పొరేషన్‌ పరిధిలో బీఎల్‌ఏ– 2ల నియామకం పూర్తయిందని తెలిపారు. పీసీసీ ప్రతినిధి చంద్రశేఖర్‌ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ సత్తు మల్లేశ్‌, ఏఎంసీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఎండీ. తాజ్‌, పులి ఆంజనేయులు గౌడ్‌, కర్ర సత్య ప్రసన్నరెడ్డి పాల్గొన్నారు.

జమ్మికుంట: మండలంలోని బిజిగిరి షరీఫ్‌ దర్గాలో సంథల్‌ షరీఫ్‌ ఉత్సవాన్ని శుక్రవారం వేకువజామున ఘనంగా నిర్వహించారు. మొల్లపల్లి, పెద్ద బిజిగిరిషరీఫ్‌ గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు మేళతాళాల మధ్య సంథల్‌ షరీఫ్‌ను దర్గాకు తీసుకొచ్చి హజ్రత్‌ సయ్య ద్‌ ఇంకుషావలి రహమతుల్లా అలై, హజ్రత్‌ సయ్యద్‌ అజ్మత్‌షావలి రహమతుల్లా అలై, హజ్రత్‌ సయ్యద్‌ అక్బర్‌షావలి రహమతుల్లా అలై, హజ్రత్‌ సయ్యత్‌ ముర్తుజాషావలి సమాధులకు అలంకరింపజేశారు. ముస్లిం మత గురువు మౌలాన యాసీన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ముజఫర్లు హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చిన చాదర్లను సమాధులకు సమర్పించారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ చాదర్లు సమర్పించారు. ఏసీపీ మాధవి, టౌన్‌ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దర్గా మతవల్లి మహమ్మత్‌ అక్బర్‌ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ ఇక్బాల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement