న్యూస్‌రీల్
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026
కరీంనగర్ కలెక్టరేట్.. వివిధశాఖల ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అర్జీదారులు, ప్రజలతో బిజీగా ఉంటుంది. వందల సంఖ్యలో ఉద్యోగులు, సందర్శకులు వస్తుంటారు. ప్రజలు, ఉద్యోగులే కాదు.. కలెక్టరేట్ కొద్దిరోజులుగా కుక్కలు, కోతులకు ఆవాసంగా మారుతోంది. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద పదుల సంఖ్యలో కుక్కలు సేదతీరుతుండగా.. సమీపంలో వానర దండు తిష్ట వేసుకుని కూర్చుంటోంది. వాటిని చూసిన కలెక్టరేట్‌కు వచ్చే ఉద్యోగులు, ప్రజలు భయాందోళనకు గురవుతుండగా.. ‘ఏయ్ బిడ్డా.. ఇది మా అడ్డా..’ అన్నట్లు దారికి అడ్డంగా దర్జాగా సేదతీరుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


