కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్‌లో ఉండటంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఉభయవర్గాలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ వివాదం పెద్దది కాకుండా చూస్తున్నారు. శుక్రవారం ఉదయమే ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నాయకుడు ముకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం చర్చకు సవాలు విసిరిన బీజేపీ నాయకులను కూడా హౌస్ అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ– కాంగ్రెస్ మధ్య పోరు.. ప్రెస్‌మీట్లు, ఆరోపణలు, పోస్టర్లకే పరిమితం కాకుండా సోషల్‌మీడియాకూ పాకింది. సోషల్‌మీడియాలో రెండు పార్టీల కార్యకర్తలు ఇష్టానుసారంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పోస్టులపైనా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఎంపీ– ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వర్గపోరు జగిత్యాల జిల్లా రాజకీయాలను అమాంతం వేడెక్కించాయి.


