బ్యాంకు నుంచే చేయూత | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు నుంచే చేయూత

May 30 2026 2:56 AM | Updated on May 30 2026 2:56 AM

● నూతన విధానానికి కసరత్తు

కరీంనగర్‌ అర్బన్‌: చేయూత పింఛన్లు లబ్ధిదారుల కు చేరేలా ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. బ్యాంకుల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు తదనుగుణ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో తపాలాశాఖ ద్వారా అందజేస్తున్నారు.

గతానికి చెల్లుచీటి

గతంలో లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా చెల్లించేందుకు వ్యక్తిగత ఖాతాలు తెరిపించారు. పింఛన్ల పంపిణీ సమయంలో బ్యాంకుల్లో రద్దీతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెనక్కి తగ్గారు. దీంతో నేటి వరకు తపాలాశాఖ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకు ఖాతాలులేని వారికి మళ్లీ వ్యక్తిగత ఖాతాలు తెరిపించాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకుల ద్వారా ఎలా అందజేస్తారన్న విషయమై ఇంకా స్పష్టత లేదు.

జిల్లాలో చేయూత లబ్ధిదారులు: 1,23,041

వృద్ధాప్య: 48,918, వితంతు: 34,229

దివ్యాంగులు: 20,702

గీతకార్మికులు: 3,767

చేనేత కార్మికులు: 2,817

ఒంటరి మహిళలు: 3,271,

బీడీ కార్మికులు: 9,937

Advertisement
 
Advertisement
Advertisement