కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్‌ఎస్, బీజేపీ వాళ్లకు కరీంనగర్ ఏఎంసీ డైరెక్టర్ పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుదగోని లక్ష్మీనారాయణగౌడ్ ఏఐసీసీ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు కరీంనగర్, తిమ్మాపూర్ నాయకులతో కలిసిన వెళ్లిన ఆయన మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. ఏఎంసీ చైర్మన్‌గా తనను నియమించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతిపాదించినా పట్టించుకోకుండా తనకు అన్యాయం చేశారని ఆమెకు వివరించారు. ఏఎంసీ నియామకాల్లో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలని, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి వెలిచాల రాజేందర్‌రావును తొలగించాలని కోరారు.


