న్యూస్‌రీల్
భక్తిశ్రద్ధలతో బక్రీద్
కరీంనగర్‌కల్చరల్: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ను జిల్లావ్యాప్తంగా ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రేకుర్తి సాలెహ్‌నగర్, కళాభారతి వద్ద, కొత్తపల్లి, చింతకుంట, బైపాస్‌రోడ్డులో ఉన్న ఈద్గాలు, గ్రామాల్లోని దర్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు సందేశమిచ్చారు. సాలెహ్‌నగర్ ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు. ఈద్గా వద్ద విధుల్లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు ఎస్సారార్ కళాశాల నుంచి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నగరపాలక సంస్థ, విద్యుత్, వైద్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


