ఉపాధి కోర్సులు.. భవితకు వెలుగులు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కోర్సులు.. భవితకు వెలుగులు

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

● డిగ్రీలో అందుబాటులో నూతన కోర్సులు ● ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి అమలు

కరీంనగర్‌సిటీ: ప్రస్తుత ఏఐ జనరేషన్‌లో విద్యార్థులు ఉపాధి లభించే కోర్సులనే ఎంపిక చేసుకుంటున్నారు. తక్కువ వ్యవధిలో జీవితంలో స్థిరపడేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్న డిగ్రీ విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధి లో 18 ప్రభుత్వ డిగ్రీ, పీజీ, 3 అటానమస్‌, 55 ప్రైవేటు కాలేజీలున్నాయి. పలు కళాశాలల్లో ఉపాధి కోర్సులు ప్రారంభమయ్యాయి. యువత త్వరగా ఉద్యోగాలు సాధించే విధంగా ఎస్సారార్‌, మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాలలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఉపాధి కోర్సులు ప్రవేశపెట్టారు. ఇంటర్‌ ఫలితాలు వెలువడడంతో డిగ్రీ కళాశాలలో చేరిన మొదటి ఏడాది నుంచే ఉపాధి కల్పించే దిశగా ఏఈడీపీ (అప్రెంటిస్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రాం) అమలు చేస్తున్నారు. ఆయా కోర్సులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement