ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు

May 28 2026 1:52 AM | Updated on May 28 2026 1:52 AM

కరీంనగర్‌అర్బన్‌/కరీంనగర్‌కల్చరల్‌/రామడుగు: జూన్‌ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు ప్రొటోకాల్‌ పక్కాగా పాటించాలన్నారు. వేడుకల నిర్వహణపై కలెక్టరేట్‌లో బుఽ దవారం సమీక్షించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆవిర్భావ వేడుకల్లో ప్రతి బింబించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

బక్రీద్‌ ప్రశాంతంగా జరుపుకోవాలి

జిల్లాలో గురువారం బక్రీద్‌ను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని కలెక్టర్‌ చిత్రామి శ్రా సూచించారు. స్లాటర్‌ హౌస్‌ల వద్ద అధికా రులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఆవులు, దూడల వధ నిషేధమని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ.. బక్రీద్‌ సందర్భంగా ప్రత్యేక బందోబస్తు చేపట్టామని తెలిపారు.

జాతీయ రహదారి నిర్మాణంపై సమీక్ష

వరంగల్‌– కరీంనగర్‌ జాతీయ రహదారి 563 నిర్మాణంలో సమస్యలు పరిష్కరిస్తూ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులను, ఆర్డీవోను ఆదేశించారు. ఈదులగట్టెపల్లి వద్ద సర్వీస్‌ రోడ్డు సాధ్యసాధ్యాలను పరిశీలించాలని, గట్టుదుద్దెనపల్లి వద్ద డ్రైనేజీ నిర్మాణం, భూ సేకరణ తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీలో ఉన్న రాజీవ్‌ స్వగృహ అంగారిక టౌన్‌షిప్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. రామడుగు మండలంలోని వన్నారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి

కరీంనగర్‌రూరల్‌: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ మండలం నగునూరు, చేగుర్తి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. నగునూరులో ధాన్యం తీసుకొచ్చి నెలరోజులవున్నా కాంటా పెట్టడంలేదని పలువురు రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. సివిల్‌సప్‌లై అధికారులను అక్కడికి పిలిపించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. చేగుర్తిలో రాత్రి వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అధికారులు, రైసుమిల్లర్లతో మాట్లాడి తడిసి ధాన్యం కాంటా పెట్టించి రైసుమిల్లుకు పంపించారు. కరీంనగర్‌, దుర్శేడ్‌ సొసైటీల చైర్మన్లు పి.శ్యాంసుందర్‌రెడ్డి, టి.తిరుపతి పాల్గొన్నారు.

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దనిన నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ హెచ్చరించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పారిశుధ్య విభాగం సూపర్‌వైజర్లు,శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లతో సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య పనులపై ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, సూపర్‌ వైజర్లు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. బక్రీద్‌ పండుగకు ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రైనేజీలు పొంగకుండా, రోడ్లపై నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

105 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు...

నగరంలో 105 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొని, గృహప్రవేశాలు అయ్యాయని కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు. బుధవారం గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిదిలో మొత్తం 524 ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్‌ పూర్తి చేస్కోని చివరి దశలో ఉన్నాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement