కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌రూరల్/గన్నేరువరం: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజామున వరకు గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షానికి కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. మానకొండూర్, గన్నేరువరం, గంగాధర, కరీంనగర్ రూరల్ మండలాల పరిధిలో తీవ్రనష్టం వాటిల్లింది. కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లిలో ఇళ్లు కూలగా.. బాధితులు బోరున విలపించారు. మానకొండూర్ మండలం వెల్ది– లక్ష్మిపూర్ గ్రామాల మధ్య చెట్లు కూలాయి. విద్యుత్ తీగలు తెడిపడ్డాయి. గంగాధరలో ధాన్యం తడిచింది. అకాల వర్షంతో కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సంస్థకు సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు ఎస్‌ఈ ఆర్.రవీందర్ తెలిపారు.


