మద్యం తాగొచ్చి వేధింపులు.. | - | Sakshi
Sakshi News home page

మద్యం తాగొచ్చి వేధింపులు..

May 28 2026 1:52 AM | Updated on May 28 2026 1:52 AM

రామడుగు: నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను భార్య రోకలి బండతో మోది హత్య చేసింది. ఈ ఘటన రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొక్కెరకుంట గ్రామానికి చెందిన వేముండ్ల రాజయ్య(70) కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎకరం వ్యవసాయ భూమి విక్రయించాడు. వచ్చిన డబ్బులతో నిత్యం తాగివచ్చి భార్య వేముండ్ల కనుకమ్మ, కొడుకు శేఖర్‌తో గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి సైతం మద్యం తాగి వచ్చాడు. భార్యతో గొడవ పడి నిద్రపోయాడు. రాజయ్య పడుకున్న తరువాత కనుకమ్మ ఇంట్లో ఉన్న రోకలి బండతో తల, చాతి, మోకాళ్లపై మోది చంపేసింది. కూతురు నంగి సుజాత బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు.

భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

రామడుగు మండలం కొక్కెరకుంటలో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement