ఉరుకుల పరుగుల
ఓ ఉడుతా...
ఊయల ఊపుత
వచ్చి ఊగమ్మా..!
గెంతులు గెంతే
ఓ కోతి
కొబ్బరి కుడకలు ఇస్తా
కొరుక్కు తినవమ్మా..!
భౌ భౌ అరుపుల
ఓ బేబీ
నీకు భోజనం పెడతా
భోంచేయమ్మా..!
మ్యావ్..మ్యావ్ మీసాల
ఓ పిల్లి కూన
తియ్యటి పాలు పోస్తా
తాగి పోవమ్మా..!
మే.. మే నెలల
ఓ బుజ్జీ మేకా
మా తోటకు పోదాం
చక చక రారా...!
కావ్..కావ్ కూతల
ఓ నల్ల కాకీ
కుండడు నీళ్లిస్త
కూచోవమ్మా...!
కూ.. కూ పాటల
ఓ కోకిలమ్మా
కొండపల్లి బొమ్మిస్తా
ఆడుకోవమ్మా..!
చిట్టి చిట్టి పలుకుల
ఓ చిలకమ్మా
నీకు జాంపండిస్తా
మాటాడమ్మా..!
ఆటల పాటల
ఓ నేస్తాలూ
అలుగక నాతో రావాలి
కబుర్ల పండుగ చేయాలి..!
చిలిపి చేష్టల
ఓ చిన్నారి...
చీకు చింతలూ వదలాలి
చిందులు వేస్తూ నవ్వాలి..!!
– డాక్టర్ కటుకోఝ్వల రమేశ్, కవి, రచయిత, ఖమ్మం జిల్లా


