సముద్రజీవుల పేర్లతో పొడుపు కథలు
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు హారిక (25) అనే వివాహిత భర్తతో గొడవపడి క్షణికావేశంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రంగసాయిపల్లి గ్రామానికి చెందిన హారికను రెండు సంవత్సరాల క్రితం మల్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు శరత్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె మానసికస్థితి సరిగా లేక తల్లిదండ్రులను తరచూ డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేదని, భర్తతోనూ డబ్బుల విషయంపై గొడవపడేదని ఎస్సై పేర్కొన్నారు. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని తండ్రి గుడ్ల రాజయ్య ఫిర్యాదు చేశాడు.
మృత్యువే గెలిచింది
రూ.10లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నెల రోజులుగా చేస్తున్న జీవన్మరణ పోరాటంలో ఆ యువరైతు చివరికి ఓడిపోయాడు. రూ.10లక్షలు వెచ్చించి చికిత్స అందించినా ప్రాణాలు నిలువలేదు. కుటుంబానికి పెద్ద దికై ్కనా రైతు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌కు చెందిన రైతు ముత్యాల బాపురెడ్డి(43) నెల రోజుల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. మొదట కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని కోమాలోనే 20 రోజులపాటు చికిత్స పొందుతున్న క్రమంలోనే పరిస్థితి విషమించి బుధవారం మరణించాడు. మృతునికి భార్య మానస, ఇద్దరు కుమారులు తరుణ్, వరుణ్ ఉన్నారు.


