సాయంత్రం తాతయ్య అరుగు మీద కూర్చుని ‘రండి పిల్లలూ, లెక్కలు చేద్దాం’ అని పిలిచాడు.
బన్నీ దగ్గర 5 చింతగింజలు ఉన్నాయి. తాతయ్య ఇంకో 3 ఇచ్చాడు.
తాతయ్య: ‘బన్నీ, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 + 3 = ?’
బన్నీ లెక్కపెట్టి ‘8 ఉన్నాయి తాతయ్యా’ అన్నాడు.
“ Very good!’ అన్నాడు తాతయ్య.
స్వప్న దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి. రామ్‌కి 4 ఇచ్చింది.
తాతయ్య: ‘స్వప్న, నీ దగ్గర ఇప్పుడు ఎన్ని మిగిలాయి? 10 – 4 = ?’
స్వప్న: ‘6 బిస్కెట్లు మిగిలాయి’ అంది.
రామ్ దగ్గర 7 పెన్సిల్స్ ఉన్నాయి. చుక్కకి 2 ఇచ్చాడు. మళ్లీ తాతయ్య 5 ఇచ్చాడు.
తాతయ్య: ‘రామ్, ఇప్పుడు లెక్క చెప్పు. 7 – 2 + 5 = ?’
రామ్ ఆలోచించి ‘10 పెన్సిల్స్’ అన్నాడు.
తాతయ్య మెచ్చుకుని ‘లెక్కలు ఇలా రోజూ చేస్తే తేలిక’ అన్నాడు.
పిల్లలకి మాట :
చిన్న చిన్నగా లెక్కలు చేస్తూ
ఉంటే జీవితంలో సమస్యలను
పరిష్కరించడం తెలుస్తుంది.
డాక్టర్ కోట లక్ష్మణ్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి,
మంథని, జిల్లా: పెద్దపల్లి


