ఎంఆర్‌ లినాక్‌తో కేన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు | - | Sakshi
Sakshi News home page

ఎంఆర్‌ లినాక్‌తో కేన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు

May 28 2026 1:52 AM | Updated on May 28 2026 1:52 AM

కరీంనగర్‌: ఎంఆర్‌ లినాక్‌తో కేన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌ ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ భరత్‌ చంద్ర తెలిపారు. కరీంనగర్‌ యశోద మెడికల్‌ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బ్రెస్ట్‌, ఊపిరితిత్తులు, నోటి, సర్వైకల్‌ కేన్సర్లు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేన్సర్‌ చికిత్సలో రేడియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది ట్యూమర్‌ కణాలను నాశనం చేయడమే కాకుండా రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. దేశంలో తొలిసారిగా యశోద హాస్పిటల్స్‌లో ఎలెక్టా సంస్థ రూపొందించిన అత్యాధునిక ఎంఆర్‌– లినాక్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏఐ ఆధారిత అడాప్టివ్‌ ట్రీట్మెంట్‌ ప్లానింగ్‌, తక్కువ దుష్ప్రభావాలు, అధిక మోతాదులో రేడియేషన్‌ను సురక్షితంగా అందించే సామర్థ్యం ఈ సాంకేతికత ప్రత్యేకతలని తెలిపారు. ప్రోస్టేట్‌, సర్వైకల్‌, ప్యాంక్రియాటిక్‌, రెక్టల్‌ కేన్సర్లు, బ్రెయిన్‌ ట్యూమర్ల చికిత్సలో ఎంఆర్‌– లినాక్‌ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

యశోద రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ భరత్‌ చంద్ర

Advertisement
 
Advertisement
Advertisement