అమ్మ కూచి పిల్లలం
ఉమ్మకోరు మల్లెలం
వెన్నతిన్న వారలం
చిన్నగున్న పోరలం!
వెచ్చనైన ఆ తల్లి ఒడి
మచ్చికై న మా తొల్లి బడి
ఆ తల్లి ఒడిలో శయనిస్తం
మా తొల్లి బడిలో విహరిస్తం
అమ్మ చంక నెక్కుతాం
నాన్న చేతికి చిక్కుతాం
అమ్మ ఇచ్చు ముద్దులు
నాన్న చెప్పు సుద్దులు !
వెండి గిన్నె నాన్న తెచ్చు
వండి బువ్వ అమ్మ ఇచ్చు
తియ్యగా మేము తింటాం
హాయిగా ఇక ఆడుకుంటాం !
క్రమశిక్షణతో పొందుగుంటం
అక్షర శిక్షణను అందుకుంటం
గుడి గంటను కుద్దుగా వింటాం
బడిబాటను ముద్దుగా కంటాం !
– గుర్రాల లక్ష్మారెడ్డి,
కవి రచయిత
కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా


