కరీంనగర్ కార్పొరేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రయాణం చేసేందుకు ఎడ్ల బండ్లే దిక్కవుతున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంకమ్మతోటలోని తన నివాసం నుంచి బస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న సుడా కార్యాలయం వరకు ఎడ్ల బండిపై ప్రయాణించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్లో పాయిజన్ ఇచ్చినట్టు రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వతం మల్లేశం, జగన్ రెడ్డి, నాయకులు గుండటి శ్రీనివాస్ రెడ్డి, పిట్టల రవీందర్, సుదర్శన్, శ్రీధర్ రెడ్డి, పటేల్ శ్రీనివాస్‌రెడ్డి, కాంపెల్లి కీర్తి కుమార్, గడమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.


