కరీంనగర్ కార్పొరేషన్: అదనపు కమిషనర్ సువార్తను సస్పెండ్ చేయాలని కార్మికులు బల్దియా ఎదుట ధర్నా చేపట్టారు. బీఆర్‌టీయూ, సీఐటీయూఽ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ శానిటేషన్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు కమిషనర్ సువార్త నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో తన ఇంట్లో పనులు చేయించుకొంటోందని ఆరోపించారు. కార్మికులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని, దొంగతనం నెపం మోపి పోలీసులకి అప్పగించి థర్డ్ డిగ్రీ పెట్టించిన సువార్తను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఇండ్లల్లో కార్మికులతో పనులు చేయించుకొనే విధానానికి ముగింపు పలకాలన్నారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు గడ్డం సంపత్, జనగాం రాజమల్లు, పొన్నం లింగయ్య, కవ్వంపెల్లి రవి, పారునంది ఎల్లయ్య, మాతంగి లక్ష్మణ్, దాంపెల్లి రాయమల్లు, మాతంగి స్వామి, మాతంగి లక్ష్మణ్, భద్ర కంటి రవి పాల్గొన్నారు.


