98వేల ఇళ్లలో జనగణన పూర్తి | - | Sakshi
Sakshi News home page

98వేల ఇళ్లలో జనగణన పూర్తి

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

98వేల ఇళ్లలో జనగణన పూర్తి కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో ఇప్పటివరకు 98,064 ఇండ్లల్లో జనగణన పూర్తి చేశామ ని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ తెలిపారు. నగరవ్యాప్తంగా 1,66,231 నివాస గృహాల్లో సర్వే చేయాల్సి ఉండగా, సగానికి పైగా పూర్తి అయినట్లు వెల్లడించారు. తొలి దశ జనగణనను మంగళవారం రాంనగర్‌, మంకమ్మతోట తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన గణన ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఫార్మాట్‌ ప్రకారం ప్రజల జీవన స్థితిగతులు, నివాసగృహా వసతులు, తదితర ఖచ్చితమైన వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్ప నకు గణాంకాలే ప్రాతిపదిక అన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్లు ఇన్‌చార్జీ అధికారులు సమన్వయంతో పని చేసి జనగణనను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌ల పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి, ఖచ్చితమైన వివరాలను సేకరించాలన్నారు. రైల్వే ఐరన్‌గేజ్‌లో చిక్కుకున్న ట్యాంకర్‌ కరీంనగర్‌రూరల్‌: తీగలగుట్టపల్లి రైల్వేగేట్‌ సమీపంలో భారీ వాహనాలు ప్రవేశించకుండా రైల్వేశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐరన్‌గేజ్‌ రాడ్‌కు చిక్కి మంగళవారం భారీ ట్యాంకర్‌ నిలిచిపోయింది. కరీంనగర్‌ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న లారీలో ట్యాంకర్‌ను తరలిస్తుండగా పైభాగం ఐరన్‌గేజ్‌ రాడ్‌కు చిక్కుకుంది. ట్యాంకర్‌ ఎట్టు వెళ్లకపోవడంతో వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు వచ్చి లారీ టైర్ల గాలిని కొంతమేరకు తొలగించడంతోపాటు పైన ఐరన్‌గేజ్‌కు చిక్కుకున్న ట్యాంకర్‌ రాడ్లను తీసివేయడంతో లారీ ముందుకెళ్లింది. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. హెచ్‌టీ సర్వీసుల మంజూరుకు ‘సింగిల్‌ విండో’ వ్యవస్థ 29న జాబ్‌ మేళా విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌లోని కమాన్‌ రోడ్డులో ఉన్న వజ్రమ్మ టవర్స్‌లో గల యాక్సిస్‌ మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో అడ్మిన్‌, టీమ్‌ లీడర్‌, అడ్వయిజర్‌ పోస్టులకు ఈనెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన, ఆసక్తిగల యువత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 9908230384, 9963357250 నంబర్లలో సంప్రదించాలన్నారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): వినియోగదారులకు హెచ్‌టీ 11 కేవీ, 33 కేవీ ఆపై వోల్టేజ్‌ విద్యుత్‌ సర్వీసుల మంజూరును వేగవంతం చేసేందుకు ‘సింగిల్‌ విండో’ వ్యవస్థ దోహదపడుతుందని టీజీఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఆర్‌.రవీందర్‌ తెలిపారు. హెచ్‌టీ సర్వీసుల ప్రక్రియను సరళీకృతం చేయడంలో భాగంగా కార్పొరేట్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ‘హెచ్‌టీ మానిటర్‌ సెల్‌’ ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విధానంలో దరఖాస్తుల పర్యవేక్షణ బాధ్యతలను అధికారులకు విభజించినట్లు పేర్కొన్నారు. సర్కిల్‌ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్‌) అధికారి 11 కేవీ వోల్టేజ్‌ దరఖాస్తులను, కార్పొరేట్‌ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్‌) అధికారి 33 కేవీ, ఆపై వోల్టేజ్‌ దరఖాస్తులను పర్యవేక్షిస్తారన్నారు. టీజీ ఐపాస్‌ పరిధిలోకి రాని హెచ్‌టీ దరఖాస్తుదారులు మొదట టీజీఎన్‌పీడీసీఎల్‌ అధికారిక పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు పూర్తికాగానే ఒక ప్రత్యేక అప్లికేషన్‌ నంబర్‌ కేటాయించబడుతుందని, వెంటనే సంబంధిత సర్కిల్‌ కార్యాలయాల డాష్‌బోర్డ్‌లోని వెళ్లగానే, సంబంధిత అధికారి పర్యవేక్షించి వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన, ఎస్టిమేట్లకు పంపించడం జరుగుతుందన్నారు. 11 కే..వీ., 33 కె.వీ.వోల్టేజ్‌ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఫీజిబిలిటీ ఉన్న పక్షంలో రెండు రోజుల్లోనే పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారన్నారు. ఒకవేళ సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల సాధ్యపడకపోతే, ఆ వివరాలను దరఖాస్తుదారుడికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement