‘కరీంనగర్‌కు చెందిన మహేశ్ ప్రైవేటు మార్కెటింగ్ ఉద్యోగి. ఉద్యోగరీత్యా నిత్యం 100 కిలోమీటర్లకు పైగా బైక్‌పై తిరగాల్సి ఉంటుంది. వారం రోజుల క్రితం ఎండ దెబ్బతో డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. జ్వరంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా..అడ్మిట్ చేసుకుని, నాలుగు రోజులు చికిత్స అందించారు. మహేశ్ కోలుకుని డిశ్చార్జి కాగా.. తనకు వచ్చే నెల జీతం కన్నా... ఆస్పత్రి ఫీజు తడిసి మోపెడయ్యింది’.
కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన హరీశ్ మార్కెట్లో హమాలీ కార్మికుడు. ఎండలో పనిచేయడం కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. తల తిరగడం.. ఒళ్లు నొప్పులు, జ్వరం, చర్మ సమస్యలతో బాధ పడుతూ.. సమీపంలోని డాక్టర్‌ను సంప్రదించాడు. ఎండదెబ్బ తాకిందని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పగా.. వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


