వందరోజుల్లో రూ.840 కోట్లు తెచ్చా
కరీంనగర్‌ను మోడల్ కార్పొరేషన్‌గా మారుస్తా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్ : ‘నగర ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నా.. వందరోజుల్లో రూ.840 కోట్లు తీసుకొచ్చా.. స్మార్ట్‌సిటీ నిధులు రూ.70 కోట్లు.. యూఐడీఎఫ్ నిధులు రూ.50 కోట్లు వచ్చాయి.. రూ.277 కోట్లతో అమృత్ పనులు సాగుతున్నా యి.. మరిన్ని నిధులు తెస్తా.. నగర రూపురేఖలు మారుస్తా.. రాష్ట్రంలోనే కరీంనగర్‌ను మోడల్ కార్పొరేషన్‌గా మారుస్తా’నంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో రూ.1.39 కోట్లతో రెండోఅంతస్తులో భవన నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. వీటితోపాటు కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్ధరణ, షెడ్ల మరమ్మ తు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానంటూ ఇచ్చిన మాటను వంద రోజుల్లోనే నిలబెట్టుకున్నానని తెలిపారు. యూసీ ఎఫ్‌లో కరీంనగర్ కార్పొరేషన్‌కు రూ.840 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకే కేంద్రం ఆమోదం తెలి పిందని, అందులో కరీంనగర్ ఉండటం అందరికీ గర్వకారణమన్నారు. సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులను అభినందించారు. డంప్‌యార్డ్ కోసం రూ.80 కోట్లు కేటాయించామని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం విఫలం
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కొనుగోలు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, వడ్ల్లు కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకే రైతు గోస బీజేపీ భరోసా పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు తెలి పారు. ధాన్యం కొనుగోలు పైసలు కేంద్రానివా.. రాష్ట్రానివా.. సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేయర్ కొలగాని శ్రీని వాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.


