ప్రజా పాలన అంటే ఇదేనా? | - | Sakshi
Sakshi News home page

ప్రజా పాలన అంటే ఇదేనా?

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

● కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌: ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించిన ఆర్టీసీ హైర్‌బస్‌ డ్రైవర్‌ అశోక్‌ను విధుల నుంచి తొలగించడాన్ని కరీంనగర్‌ ఎమ్మెల్యే గుంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. డ్రైవర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్‌ఎం రాజుకు వినతిపత్రం ఇచ్చారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డ్రైవర్‌ను విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే ఆర్‌ఎం ఆఫీస్‌ను ముట్టడిస్తామన్నారు.

రానున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతోందని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, పార్టీ సభ్యత్వ నమోదు కరీంనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండూరి రవీందర్‌రావు అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement