రామగుండం: రైలింజన్‌లో ఏసీలు బిగించాలని కోరుతూ మంగళవారం రామగుండంలోని క్రూలాబీ ఎదుట లోకోపైలట్లు నిరసన వ్యక్తం చేశారు. అధిక ఉష్ణోగ్రతలతో రైలింజన్‌లో 55 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని, ఏసీలు లేకుంటే పనిచేయలేమని, తమ వెంట తీసుకెళ్లిన ఆహారం చెడిపోతుందని, రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం ఏసీలు బిగించాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో లోకో రన్నింగ్ స్టాఫ్ రామగుండం బ్రాంచ్ సెక్రటరీ సీహెచ్.రవి, కమిటీ మెంబర్లు వేణుగోపాల్, సంజీవ్, సహాయ లోకో పైలట్లు వినోద్, శ్రీనివాస్, అనిష్ సూరజ్, గన్ శ్యాం, రవి, ప్రశాంత్‌తో పాటు లోకో పైలట్లు పాల్గొన్నారు.


