చిన్ని పాపల మది
దేవుడు ఉండే గుడి
చిట్టి పాపల పలుకు
అమృతపు చినుకు
బుడిబుడి అడుగులు వేశారంటే
భూమాత పులకించేను
ముద్దు ముద్దుగా పలికారంటే
అమ్మనాన్న మురిసేను
మల్లెపువ్వులా నవ్వారంటే
రాతి గుండెలే కరిగేను
చందమామలా చుశారంటే
మదిలో వెన్నెల కురిసేను
కల్లాకపటం ఎరుగనివారు
ఎవ్వరినైనా మురిపిస్తారు
కులమతాలు తెలియనివారు
అందరి మనసులు దోచేస్తారు
బూర దేవానందం
కవి, రచయిత
సిరిసిల్ల
రాజన్న
సిరిసిల్ల జిల్లా


