● పెరుగుతున్న ఆదరణ ● 1920లో దేశంలో పరిచయం ● 1964లో ఒలింపిక్స్‌లో చోటు
కరీంనగర్‌స్పోర్ట్స్: వాలీబాల్ ఆరోగ్యానికి మానసికోల్లాసాన్ని ఇస్తుంది. వాలీబాల్ ఆడడం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాయామంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. దినదినాభివృద్ధి చెందిన ఈ క్రీడ ఒలింపిక్స్‌లో చోటు సంపాదించింది.
అమెరికాలో పుట్టి..
వాలీబాల్ అమెరికాలోని హాల్యోకిలో పుట్టింది. వాలీబాల్‌ను గతంలో మింటోనెట్టి అని పిలిచేవారు. 1947లో ఫెడరేషన్ ఇంటర్‌నేషనల్ ఈ ఆటను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. 1964 పారీస్‌ఒలింపిక్‌లో క్రీడను చేర్చారు. మన దేశంలో 1920లో వాలీబాల్‌ను పరిచయం చేశారు.
జట్టు వివరాలు
ఒక్కో జట్టుకు ఆరుగురు క్రీడాకారులు ఉంటారు. ఇరు జట్లు కలిపి 12 మంది ఆడుతారు. జట్టు సభ్యుల్లో ఒక్కరి డ్రెస్ కోడ్‌వేరుగా ఉంటుంది. ఆ సభ్యుడు లిబిరోగా వ్యవహరిస్తారు. ఆటాడే సమయంలో బాల్‌డెడ్ అయినప్పుడు, లిబిరో ఆటలోకి రావచ్చు, తిరిగి వెళ్లవచ్చు. లిబిరో స్ట్రైకింగ్ చేయరాదు.
ఆట పద్ధతి
ఒక బుస్టర్, ఐదుగురు స్ట్రైకర్లు అంటే 1:5 పద్ధతి, ఇద్దరు బూస్టర్లు, నలుగురు స్ట్రైకర్‌లు అంటే 2:4 పద్ధతి, ఒక స్ట్రైకర్, ఒక ఆల్‌రౌండర్, నలుగురు స్ట్రైకర్‌లు, ఒక లిబిరో ఉంటారు.
పాయింట్లు, రౌండ్ల వివరాలు...
జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఐదు రౌండ్లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్‌కి 25 పాయింట్లు ఉంటాయి. ఒక రౌండ్‌లో గేమ్ ముగియాలంటే ఇరు జట్ల మధ్య రెండు పాయింట్ల వ్యత్యాసం ఉండాలి. చివరి రౌండ్‌లో ఒక పాయింట్ తేడాతో విజేతలను ప్రకటిస్తారు. ఆట సమయంలో క్రీడాకారులు క్లాక్ వైజ్ రోటేషన్ పద్థతిలో ఆడాల్సి ఉంటుంది.
ఇంకా వీటిలో జంప్ సర్వీస్, పుల్‌వాలీ, స్పిన్, టెన్నిస్, డబుల్ హ్యాండ్ బ్లాక్, షూటింగ్, స్మాసింగ్, ఫ్లెసింగ్ ఉంటాయి.
కోర్టు వివరాలు
కోర్టు పొడవు 18 మీటర్లు, వెడల్పు 9 మీటర్లు. అటాక్‌లైన్ 3 మీటర్లు, సర్వీస్ లైన్లు రెండు వైపుల 15 సెం.మీ, పోల్ ఎత్తు 2.5 మీటర్లు, పోల్‌కి పోల్‌కి మధ్య వ్యత్యాసం 11 మీటర్లు, నెట్‌పొడవు 9 మీటర్లు, నెట్ ఎత్తు పురుషుల విభాగా నికి 2.40 మీటర్లు, చతురస్రారం 10 సెంటీమీటర్లు, బాల్ బరువు 270 గ్రాములు.


