సిరిసిల్లఅర్బన్: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంగళవారం విధులకు హాజరయ్యేందుకు డీఆర్‌డీఏ ఏపీడీ నర్సింహులు కలెక్టరేట్‌లోని లిఫ్ట్ ఎక్కారు. పై అంతస్తులో ఉన్న తమ కార్యాలయానికి వెళ్లేందుకు లిఫ్ట్‌లోని బటన్ నొక్కగా మధ్యలోకి వెళ్లిన తర్వాత సాంకేతిక కారాణాల వల్ల లిఫ్ట్ ఆగిపోయింది. ఆయన తన తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఉద్యోగులు వెంటనే లిప్ట్ ఆఫరేటర్లకు సమాచారం అందించగా వారు వచ్చి లిఫ్ట్ నుంచి బయటకు తీశారు. అప్పటికే గంటన్నర అవుతుందని ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డానని నర్సింహులు లిఫ్ట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వడదెబ్బకు ఇద్దరు మృతి
హుజూరాబాద్‌రూరల్/గంగాధర: హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామ ంలో నీరటి రమేశ్ వడదెబ్బతో మృతిచెందాడు. రెండు రోజులుగా పనుల నిమిత్తం ఎండలో బాగా తిరగడం వల్ల మంగళవారం అస్వస్థకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అలాగే గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన అర్కుల నర్సయ్య (58) వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. నర్సయ్య మండలంలోని గర్శకుర్తిలో బంధువు చనిపోగా సోమవారం దహన సంస్కారాలకు వెళ్లి వచ్చాడు. సాయంత్రం వాంతులు, విరేచనాలు అయ్యాయి. మంగళవారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
ఆర్టీసీ కండక్టర్‌పై పోక్సో కేసు
కోరుట్లరూరల్: పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ శేఖర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆయన కథనం ప్రకారం చందుర్తి మండలకేంద్రానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని 2016నుంచి సఖ్యతగా ఉంటున్నాడు. తాజాగా పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు వారం క్రితం వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. శేఖర్ కోరుట్లకు చెందిన వ్యక్తి కావడంతో కేసును కోరుట్ల పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇక్కడి పోలీసులు విచారణ జరిపి శేఖర్‌ను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి.. రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై తెలిపారు.
గంటన్నర తర్వాత బయటకు..


