ఉత్తమ శిక్షణ.. ప్రతిభకు పదును | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ శిక్షణ.. ప్రతిభకు పదును

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి, వారికి అంతర్జాతీయ స్థాయి వేదికను కల్పించడమే ధ్వేయంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రతిభ ఉండి సరైన వనరులు లేక ఆగిపోయే క్రీడాకారుల కలలకు ప్రాణం పోయడమే లక్ష్యంగా ఏర్పాటైన ఖేలో ఇండియా క్రీడా కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా నడుస్తున్నాయి.

క్రీడాకారుల కలలకు రెక్కలు

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా సెంటర్లు గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కలలకు రెక్కలు తొడుగుతూ సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కరీంనగర్‌లో జూడో, సిరిసిల్లలో కబడ్డీ, జగిత్యాలలో బాక్సింగ్‌, సుల్తానాబాద్‌లో ఖోఖో క్రీడల్లో అత్యున్నత స్థాయి శిక్షణను అందిస్తూ ప్రతిభకు పదును పెడుతున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం వేళ నిష్ణాతులైన శిక్షకుల పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్నవారు సంబంధిత సెంటర్లను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

లక్ష్యం.. ఒలింపిక్‌ పతకం

ఈ కేంద్రాల అంతిమ లక్ష్యం దేశాన్ని ఒలింపిక్‌ మెడల్స్‌ పట్టికలో అగ్రస్థానంలో నిలపడం. కింది స్థాయి నుంచే పటిష్టమైన క్రీడా వ్యవస్థను నిర్మించడం ద్వారా, భవిష్యత్తులో స్థిరమైన విజయాలను సాధించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆడుదాం.. గెలుద్దాం అనే నినాదంతో యువతను క్రీడల వైపు మళ్లించి, వారిని ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.

మట్టిలో మాణిక్యాలకు వేదికలుగా ఖేలో ఇండియా కేంద్రాలు

అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో తర్ఫీదు

ఉమ్మడి జిల్లాలో నాలుగు సెంటర్లు

ఉమ్మడి జిల్లాలో సెంటర్లు ఇలా..

కరీంనగర్‌

క్రీడ: జూడో

వేదిక: ప్రాంతీయ క్రీడా పాఠశాల, కరీంనగర్‌

కోచ్‌: కె.శ్యామ్‌

సెల్‌: 99084 02447

––––––––––––––––––––––––

జగిత్యాల

క్రీడ: బాక్సింగ్‌

వేదిక: వివేకానంద మినీ స్టేడియం, జగిత్యాల

కోచ్‌: నల్ల నవీన్‌

సెల్‌: 81792 68462

––––––––––––––––––––––––

సిరిసిల్ల

క్రీడ: కబడ్డీ

వేదిక: చెన్నమనేని వెంకటరావు సర్దేశాయి

మినీ స్టేడియం, సిరిసిల్ల

కోచ్‌: నగర్ల ప్రశాంత్‌

సెల్‌: 99595 56017

––––––––––––––––––––––––

పెద్దపల్లి

క్రీడ: ఖోఖో

వేదిక: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం, సుల్తానాబాద్‌

కోచ్‌: గెల్లు మధుకర్‌

సెల్‌: 79950 78488

Advertisement
 
Advertisement
Advertisement