కరీంనగర్ సెంటర్‌లో జూడో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల్లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఉచిత శిక్షణ, నాణ్యమైన వసతులు ఉండటంతో ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా ఎలాంటి భయం లేకుండా క్రీడల్లోకి వస్తున్నారు. గతేడాది చాలా మంది క్రీడాకారులు జాతీయ పోటీల్లో సత్తా చాటారు. సీఎం కప్ పోటీల్లో కూడా పతకాలు సాధించారు.
– కె.శ్యామ్, జూడో కోచ్ కరీంనగర్
ఖేలో ఇండియా సెంటర్‌లో మ్యాట్‌పై కబడ్డీ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రీడాకారులు ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా, టీమ్ వర్క్, వ్యూహాలను నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో ప్రో కబడ్డీ వంటి పెద్ద వేదికలపై మెరుస్తారనే నమ్మకం ఉంది.
– నగర్ల ప్రశాంత్, కబడ్డీ కోచ్, సిరిసిల్ల


