తరతరాలుగా సాగుతున్న
మాయాజాలం
ఆ జాదుగర్ ఎవరో గాని
విద్యార్థుల ప్రతిభను
బాగానే మాయంజేత్తండు.
అప్పట్లో దోతిపంచ ఈడీ,
అంగి ప్యాంటు ఏత్తేసాలు
సర్కార్ కొలువు అచ్చేది,
కానీ..! ఈయ్యాల
సర్కార్ కొలువు కావాలంటే
మన ముందు తరాలలో
అంగి ప్యాంట్ తొడిగిన
వాళ్లుంటే సాలు.
అక్షరాలతో పనక్కర్లే,
వేలిముద్రైన పర్లే,
అన్నట్టుగా మాయం
జేత్తండు ఆ జాధుగర్
ఎవరో గాని?
– కొలిపాక ప్రతిభ, ఎంఏ (తెలుగు)
గ్రామం: అన్నారం
కరీంనగర్ (జిల్లా)


